హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 12:
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణలో అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు రాష్ట్రంలో పర్యటించిన విషయం తెలిసిందే.
తాజాగా, ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలంగాణ రాష్ట్రంలో పర్యటించను న్నారు. మార్చి 16,17,18 వ తేదీల్లో తెలంగాణకు ఆయన రానున్నారు.
మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన జగిత్యా ల, నాగర్ కర్నూల్, మల్కా జ్‌గిరిలో బహిరంగ సభల్లో పాల్గొనే అవకాశముందని బీజేపీ రాష్ట్ర నాయకత్వం వెల్లడించింది.