అదిలాబాద్ జిల్లాలో డీఎస్సీ,ఎస్జీటీ, అభ్యర్థులకు ఉచిత శిక్షణ శిబిరం
హ్యూమన్ రైట్స్ టుడే/ఆదిలాబాద్ జిల్లా/మార్చి 12:
రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రకటించనున్న డీఎస్సీని దృష్టిలో ఉంచుకొని డీఎస్సీ, ఎస్జీటీ కోసం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిరుద్యోగ అభ్యర్థులకు ఉచిత శిక్షణను ఇవ్వనున్నట్లు జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాజలింగు, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
బీసీ, ఎస్సీ ,ఎస్టీ, ఈబీసీ అభ్యర్థులు ఈ ఉచిత శిక్షణకు అప్లై చేసుకోవాలని కోరారు. అర్హులైన అభ్య ర్థులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా ఈనెల 14 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకో వచ్చన్నారు.
ఈనెల 26 నుంచి శిక్షణ ప్రారంభించనున్నట్లు పేర్కొ న్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.5.00 లక్షల లోపు ఉండాలని తెలిపారు.
రిజర్వేషన్ ప్రకారం ఎస్జీ టీకి సంబంధించి ఇంటర్మీడి యట్, డైట్, టెట్లో సాధిం చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామన్నారు.
ఈ ఉచిత శిక్షణ 75 రోజులు ఉంటుందని, నిపుణులైన అధ్యాపకుల చేత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు 87322 21280, 99496 84959 నంబర్లు సంప్రదించాలని కోరారు.