దళితులు ఏ స్థానంలో ఉన్న అంటరానితనంతో అవమానపరచడం కాంగ్రెస్ నైజం..
ముఖ్యమంత్రి, మినిస్టర్ల కాల దగ్గర ఉపముఖ్యమంత్రిని కూర్చోబెట్టి అవమాన అవమానపరిచి, రెడ్డితనాన్ని చాటుకున్నారు.
కాంగ్రెస్ పార్టీకి దళితుల ఓట్లు కావాలి కానీ వారి ఔన్నత్యాన్ని సహించరు.
అంబేద్కర్ ను సైతం బాధ పెట్టిన పార్టీ కాంగ్రెస్..
లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని బిఎస్పి షాద్నగర్ నేత నియోజకవర్గం అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ పిలుపు.
హ్యూమన్ రైట్స్ టుడే/యాదగిరిగుట్ట/మార్చ్11:
యాదగిరిగుట్ట సందర్శనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను ఘోరంగా అవమానించిన తీరుపై బహుజన్ సమాజ్ పార్టీ షాద్నగర్ నియోజకవర్గం అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు, దళితులు ఏ స్థానంలో ఉన్న అవమాన పరచడం కాంగ్రెస్ పార్టీ విధానమని తన నైజాన్ని బయట పెట్టుకుందని ఎద్దేవా చేశారు. రెడ్డి కులస్తులైన రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి వారి కాళ్ళ దగ్గర ఉపముఖ్యమంత్రి అయిన బట్టి విక్రమార్కను కూర్చున్న బెట్టి అవమాన పరుస్తూ వారి ఆధిపత్యాన్ని ప్రదర్శించారన్నారు. కాంగ్రెస్ పార్టీకి దళితుల ఓట్లు కావాలి కానీ వారి ఔన్నత్యాన్ని సహించలేదన్నారు. అంబేద్కర్ను సైతం బాధపెట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందన్నారు. డాక్టర్ అంబేద్కర్ 40 సంవత్సరాలు భారతదేశంలో ఉన్న 20 శాతం మంది ప్రజల పై అక్రమంగా రుద్దుతున్న అంటరానితనం కుట్ర పూరితంగా రుద్దుతున్నారని కాంగ్రెస్పై పోరాటం చేశారన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి యావత్ దళిత సమాజం మరియు ఇతర బహుజన సమాజం కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. డాక్టర్ అంబేద్కర్ స్వతంత్ర రాజకీయాలు చేయాలని పిలుపు నిచ్చినందునై ఆయన ఆలోచనను విజయవంతం చేస్తూ కాన్సిరాం బిఎస్పి పార్టీని ఆత్మగౌరవంకోసం ఏర్పాటు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న దళిత నాయకులు ఏ మొహం పెట్టుకొని ఆ పార్టీలో ఉంటున్నారో, తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.