ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులను బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్ జిల్లా/18 janoury 2023:
ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులను బెదిరించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్, సోషలిస్ట్ మహాజన పార్టీ ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు గుగ్గిళ్ళ పీరయ్య, బిఎస్పి జిల్లా ఇన్చార్జి దార్ల శివరాజ్, అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కామ సంజీవ, కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుడ్డేల రామ్మూర్తి, న్యాయవాదుల దళిత సంఘం నాయకులు దర్శనం రామకృష్ణ, విద్యార్థి సంఘాల నాయకులు మంద శశి కుమార్, పోలేపాక వెంకన్న లు డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో ఎస్సీ ఎస్టీ జర్నలిస్టుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించిన సమావేశానికి పలు సంఘల నాయకులు హాజరై మాట్లాడారు. మహబూబాబాద్ జిల్లాలో కొంతమంది అధికారులు చేస్తున్న అవినీతి అక్రమాలను బయటపెడుతున్న ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులను అధికారులు బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. కొంతమంది అధికారులు ఉద్యోగాల పేరుతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నిజమైన అర్హత కలిగిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా దొడ్డిదారిన అనర్హులకు అవకాశాలు కల్పిస్తూ కమర్షియల్ చేసుకుంటున్నారని అన్నారు. మహబూబాబాద్ జిల్లాలోని గిరిజన గురుకుల శాఖలో 2022 డిసెంబర్ 19న కొంతమందిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారని ఆ తర్వాత నోటిఫికేషన్ విడుదల చేయడం వెనకాల అంతర్యం ఏంటని ఆరోపించారు. నోటిఫికేషన్ కు ముందు ఎంత మందిని తీసుకున్నారు బే బేశరత్తుగా బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈఎం ఆర్ ఎస్ గురుకులాల్లో ఇష్టానుసారంగా గురుకులాల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగాలను నియమించారని ఆరోపించారు. ఈ విషయమై ఎల్ హెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేసి పత్రికలకు ప్రకటన ఇచ్చుకుంటే, వారు పత్రికల్లో రాస్తే, మీరు ఎలా వార్తలు రాస్తారని స్వయంగా ఆర్సిఓ ఫోన్ చేసి మాట్లాడి, న్యాయవాదుల నుంచి నోటీసు పంపిస్తామని, అడ్రస్ చెప్పండి అని బెదిరించడం సబబు కాదన్నారు. ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య దేశంలో పత్రిక స్వేచ్ఛను హరిస్తున్నారని తెలిపారు. తక్షణమే ఎస్సీ ఎస్టీ జర్నలిస్టులను బెదిరిస్తున్న అధికారులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అవినీతి అన్యాయాలను వెలికితీస్తున్న ఎస్సీ, ఎస్టీ జర్నలిస్టులకు ఎమ్మార్పీఎస్ మాల మహానాడు, అంబేద్కర్ యువజన సంఘం, కెవిపిఎస్, న్యాయవాదులు, విద్యార సంఘ నాయకులు, అండగా ఉంటుందని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ జర్నలిస్టు నాయకులు కట్కూర్ ప్రసాద్, తేజవాత్ రవి నాయక్, గొర్రె చిట్టిబాబు, చంద శీను, కిరణ్ కుమార్, సహదేవ్, గుగులోతుశ్రీనివాస్ నాయక్, బోడ శ్రీను, భూక్య మోహన్ నాయక్, తేజావత్ శ్రీను నాయక్,, బాలు, శ్రావణ్, యకాంబరం, తదితరులు పాల్గొన్నారు.