రెండు కిలోమిటర్లు భూజాన మోసుకెళ్ళి ప్రాణాలు కాపాడిన పోలీసు..
హ్యూమన్ రైట్స్ టుడే/కరీంనగర్/మార్చ్11:
కరీంనగర్ వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో కుర్ర సురేష్ అనే వ్యక్తి ఇంట్లో గొడవపడి పొలం వద్దకి వెళ్ళి పురుగుల మందు త్రాగాడు.
పొలాల వద్ద రైతులు గమనించి 100కి సమాచారం ఇవ్వగా బ్లూకోర్ట్ సిబ్బంది జయపాల్ అపస్మారక స్థితిలో ఉన్న సురేష్ ని తన భూజాలపై వేసుకొని పొలాల గట్ల వెంబడి రెండు కిలోమీటర్ల మోసుకొని గ్రామంలోకి వెళ్ళాడు. జమ్మికుంట ఆసుపత్రి కి తరలించగా సురేష్ కి చికిత్స అందించి కాపాడారు.