హ్యూమన్ రైట్స్ టుడే/యాదాద్రి జిల్లా/మార్చి 10:
భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలోని అడ్డగూడూరులో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే అడ్డగూ డూరుకు చెందిన మనోహర్ గత నెల 17వ తేదీన ప్రేమ వివాహం చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నప్పటి నుంచి నవ వధువు భూమికను, మనోహర్ పేరెంట్స్ వేధింపులకు గురిచేశారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన భూమిక ఈ నెల 6వ తేదీన ఆత్మహత్యకు యత్నించింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి ఆమె ప్రాణాలు కోల్పోయింది.
భార్య చనిపోయిందని తెలు సుకున్న మనోహర్ తీవ్ర ఆవేదన చెందాడు. అతను కూడా ఫినాయిల్ తాగి ఆత్మ హత్యాయత్నం చేశాడు. కుటుంబ సభ్యులు అతన్ని తిరుమలగిరి ఆస్పత్రికి తర లించారు. అత్తింటి వేధింపు లతోనే భూమిక ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపించారు.