తాగిన మైకంలో ఉన్నాడు.. కారు తగలబెట్టాడు..!
షాద్ నగర్ పట్టణ శివారులో సంఘటన..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చ్09:
తాగిన మైకంలో ఉన్నాడు. తను వెంట తెచ్చుకున్న కారును నిర్మానుష ప్రదేశమైన రియల్ వెంచర్లో దగ్ధం చేశాడు. ప్రత్యక్ష సాక్షులు ఎందుకు ఇలా అంటే దర్జాగా కాలుతున్న కారును ఫోటోలు వీడియోలు తీసుకుంటూ ఆగండి అంటూ వారించాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులోని పాత అనూస్ కంపెనీ పరిశ్రమ ప్రదేశంలో ఖాళీ రియల్ వెంచర్లో ఈ తతంగం చోటు చేసుకుంది. నగర్ కర్నూల్ జిల్లాకు చెందిన మూర్తి అనే యువకుడు హైదరాబాద్ లో 2018 మోడల్ షిఫ్ట్ సెకండ్ హ్యాండ్ కారు కొన్నాడు. శ్రీరామ ఫైనాన్స్ లో సుమారు 5 లక్షల రూపాయలు రుణం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఐదు నెలసరి వాయిదాలు చెల్లించాడు. మరో వాయిదా చెల్లించాల్సి ఉంది. ఒక వాయిదా ఉండగానే ఈ కారును అది కూడా షాద్ నగర్ పట్టణానికి వచ్చి ఇక్కడ దగ్ధం చేయడం అనుమానాలకు తావిస్తోంది. హైదరాబాద్ లో కార్ డ్రైవర్ గా పనిచేసే మూర్తి ఈ కారులు ఎందుకు దగ్ధం చేశాడో పోలీసులు విచారణ చేపట్టారు. స్థానిక సీఐ ప్రతాప్ లింగం ను ఈ విషయం ప్రస్తావించగా మూర్తిని అదుపులోకి తీసుకున్నామని పూర్వపరాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.