పాలు అమ్మిన మల్లారెడ్డిని మళ్ళీ అదే స్థాయికి తీసుకెళ్తాం..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 09:
పాలు అమ్మిన మల్లారెడ్డిని మళ్లీ అదే స్థాయికి తీసుకెళ్తానని మైనంపల్లి హన్మంతరావు అన్నారు.
దుండిగల్‌లో జరిగిన కూల్చివేతలను ఎమ్మార్వో, మున్సిపల్ కమిషనర్‌లు తూతూమంత్రంగా చేశారని ఆరోపించారు.
దామర చెరువులో 8 ఎకరాల భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని 2011లోనే ఫిర్యాదులు వచ్చాయన్నారు.
ఆ మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని వెల్లడించారు. అహంకారంతో ఉన్న మల్లారెడ్డి ఆటలు తమ ప్రభుత్వంలో సాగవని హెచ్చరించారు.
కేసీఆర్ హయాంలో 55 వేల వక్ఫ్ బోర్డు భూములను మల్లారెడ్డి కబ్జా చేశారని విమర్శించారు.