మొన్నటి వరకు పోటీకి రెడీ అన్న నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా..

Get real time updates directly on you device, subscribe now.

పార్లమెంట్‌ ఎన్నికలకు పోటీ చేసేందుకు బిఆర్ఎస్ కు అభ్యర్థులు కరువు?
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చి 09:
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఓటమితో గులాబీ ఎందుకు వాడిపోతోంది. ఒక్క ఓటమిని భరించలేని బీఆర్‌ఎస్‌ నేతలు పార్టీ నుంచి కొంత మంది వైదొలిగితే మరికొంత మంది ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాలకు దూరం అవుతున్నారు.

ఒకప్పుడు బీఆర్‌ఎస్‌ సీటు ఇస్తే చాలు అనుకున్న నేతలు ఇప్పుడు ఆ పార్టీ తరపున లోక్‌సభ ఎన్నికల్లో బరిలో దిగడానికి మొరాయిస్తున్నారు. అగ్రనేతలు సైతం పోటీకి వెనుకాడుతున్నారు.

పార్లమెంట్‌ ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ అగ్ని పరీక్ష ఎదుర్కొంటోంది. 17 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్దులు కరువయ్యారు. మొన్నటి వరకు పోటీకి రెడీ అన్న నేతలు ఇప్పుడు ఒక్కొక్కరుగా పోటీకి ససేమిరా అంటున్నారు.

నల్గొండ నుంచి బరిలోకి దిగుతానన్న శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనయుడు అమిత్‌ పోటీకి నుంచి తప్పకుంటున్నానని ఇప్పటికే పార్టీకి సంకేతాలు ఇచ్చాడు. గత లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్దిగా పోటీ చేసిన మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు సాయి కూడా పోటీకి వెనుకడుగు వేస్తు న్నారట.

మల్కాజిగిరిలో తన కొడుకు భద్రారెడ్డిని బరిలోకి దించు తానని నిన్న మొన్నటి వరకు చెప్పిన మాజీ మంత్రి మల్లారెడ్డి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ను కలిసి తమ ఫ్యామిలీ నుంచి పోటీ చేయబోమని తేల్చి చెప్పేశారట.

చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజి త్‌రెడ్డి తాను పోటీకి సిద్దంగా లేనని పార్టీకి ఇప్పటికే సంకేతాలు ఇచ్చారట.ఇక వరంగల్‌, మహబూబా బాద్‌, ఆదిలాబాద్‌, పెద్దపల్లి, మహబూబ్‌నగర్‌, భువనగిరి లాంటి నియోజ కవర్గాల్లో పోటీ చేస్తాం, కానీ పార్టీయే ఖర్చులు భరించా లంటున్నారు.


పార్టీ నాయకులు ఇలా మాట్లాడతారని, ఇలాంటి పరిస్థితి వస్తుందని బీఆర్‌ఎస్‌ కలలో కూడా ఊహించి ఉండదు. పార్టీ స్థాపించిన నాటి నుంచి ఇప్పటి వరకు తొలిసారి ఇలాంటి గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment