అడిగినంత ఇస్తే సరి లేకుంటే కొర్రీలే..!

Get real time updates directly on you device, subscribe now.

రెవెన్యూ రికార్డు కావాలంటే లంచం  ఇవ్వాల్సిందే..!

*తము తీసుకున్న లంచం లో పై అధికారులకు కాస్త వాటా ఇవ్వాలి అంటున్న క్రింది స్థాయి సిబ్బంది.!*

*తాహాశిల్దార్ కార్యాలయల్లో ప్రైవేట్  వ్యక్తుల హవా.!*

*లంచం తీసుకుంటూన్న వీడియోస్ వెలుగులోకి .!*

*నోట్ల కట్టలు లెక్కబెడుతున్న సిబ్బంది. !*

*అడిగినంత ఇస్తే సరి లేకుంటే కొర్రీలే..!*

*భూమి పత్రాలు కావాలన్న జవాన్ కు చేదు అనుభవం.!*
*డబ్బులు ఇస్తే కానీ భూమి  పత్రాలు ఇవ్వని  సిబ్బంది.!*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/మార్చ్ 08:
దేశ రక్షణ కోసం ఆ జవాను  ప్రాణాలకు తెగించి మరి విధులు నిర్వహిస్తుంటే ఈ కార్యాలయంలో మాత్రం లంచ గోండులు డబ్బుల కోసం జనాలను జలగల్లా పట్టి పీడిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు తహసశిల్దార్ కార్యాలయం లో పనిచేస్తున్న సిబ్బంది ఓ జవాను వద్దే డబ్బులు వసూలు చేశారంటే వాళ్ళు వసూళ్లలో ఎంత రాటుదేలారో అర్థం అవుతుంది.

*తాసిల్దార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల హవా..!*

రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం విశ్వనాథపూర్ గ్రామానికి చెందిన అశోక్ రెడ్డి తన భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డు ఆర్వోఅర్ పహాని లు కావాలని కొందుర్గ్ మండల తాహాసిల్దార్ కార్యాలయంలో ధారఖాస్తు చేసుకున్నారు. అయితే ఆ రికార్డు ఇవ్వడానికి 40 వేల రూపాయలు ఖర్చు అవుతుందని సిబ్బంది చెప్పడంతో కొంత అమౌంట్ ఆన్లైన్ ద్వారా చేసిన ఆయన  మిగతా అమౌంట్ నగదు రూపంలో ఇస్తూ లంచం అడిగిన దృశ్యాలను వీడియోస్ తీశాడు. ఆ వీడియోలను బయటకు విడుదల చేస్తూ ఇలాంటి అవినీతి అధికారుల పైన ఉన్నత స్థాయి అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మరో సెల్ఫీ వీడియో విడుదల చేశారు. ఇది ఇలా ఉంటే లంచం డిమాండ్ చేస్తున్న సిబ్బంది మాత్రం తమ కార్యాలయంలో తీసుకున్న లంచం లో మరికొంత వాటా పై స్థాయి అధికారులకు ఇవ్వాల్సి ఉంటుందని చెప్పడం విడ్డూరం.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment