నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్ జిల్లా/మార్చి08:
నిజామాబాద్ జిల్లా కేంద్రం లో గురువారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలిసింది.

ప్రముఖ దైవక్షేత్రం శంభుని గుడి ఆలయం వద్ద అహ్మద్ ఎస్టేట్ అనే భవనంలో ప్రమాదవశాత్తు కరెంటు షార్ట్ సర్క్యూట్‌తో ఒక పోర్షన్‌లో మంటలు చెలరేగాయి.

శివరాత్రి ఉత్సవాలకు అంత సిద్ధమైన వేల ఆలయం ఎదుట గల భవనంలో మంటలు చెలరేగడంతో స్థానికులు బయ ఆందోళనకు గురయ్యారు.

రెండు గదుల్లో అగ్నికీలల్లో చిక్కుకున్నాయి. సంబంధిత పోర్షన్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్లను అగ్నిమాపక సిబ్బంది తొలగించి మంటలను ఆర్పివేశారు.

అక్కడ ఎలాంటి ప్రాణా నష్టం సంభవించలేదని స్థానికులు తెలిపారు. షాప్ నిర్వాహకురాలు డ్వాక్రా సంఘం సభ్యురాలని తెలిసింది.

చీరల అమ్మకం తాలూకుతో పాటు నిల్వ ఉంచిన ఐదు లక్షల కరెన్సీ నోట్లు అగ్ని ప్రమాదంలో కొన్ని పూర్తిగా మరికొన్ని పాక్షికంగా కాలిపోయాయి. అవి చలామణి కావు అని నిర్ధారించారు.

ఆస్తి నష్టం అంచనాను అధికారులు ఇంకా వెల్లడించలేదు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment