గుండె నిండా ఆవేదనతోనే..కన్నీటి వీడ్కోలు

Get real time updates directly on you device, subscribe now.

కన్నీళ్లతో పరీక్ష రాసిన విద్యార్థిని..

హ్యూమన్ రైట్స్ టుడే/విశాఖ జిల్లా /మార్చి08:
విశాఖ నగరంలోని హనుమాన్ నగర్‌లో నివాసం ఉంటున్నా లారీ డ్రైవర్ సోమేశ్ కు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించాడు.

పిల్లలను పెద్దవారిని చేశాడు. పెద్దకూతురు మానసికంగా అంత మతిస్థిమితం  లేకపోవడంతో చంటి పిల్లలా కాపాడుకున్నాడు. చిన్న కూతురుని చదివించాడు. చిన్న కూతురు ఢిల్లీశ్వరి అన్నీ తానై పేరెంట్స్‌కు చేదోడు వాదోడుగా నిలిచింది.

ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతోంది చిన్న కూతురు. పరీక్షలు మొదలవడంతో ప్రిపేర్ అవుతోంది. ఈరోజు ఉదయాన్నే పరీక్షకి వెళ్దామని అనుకున్న ఆమెకు మరోసారి విధి పరీక్ష పెట్టింది. అనారోగ్యంతో మంచం పట్టిన తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.

ఇద్దరూ కూతుళ్లే ..! అక్క మానసిక స్థితి బాలేదు. తనే అంత్యక్రియలు తండ్రికి చేయాలి. మరోవైపు ఇంటర్మీడియట్ పరీక్షకు హాజరు కావాలి. జీవితానికి బాటలు వేసే పరీక్ష కంటే తనకు జీవితం ప్రసాదించిన తండ్రికి చివరి కార్యక్రమాలు చేయడమే ముఖ్యం అనుకుంది.

పరీక్ష రాసేందుకు వెళ్లనని పట్టుబట్టడంతో స్థానికులు నచ్చ చెప్పారు. పరీక్ష అయ్యేవరకు అంత్యక్రియలు ఆపుదామని చెప్పి ఆమెను ఎగ్జామ్ సెంటర్‌కు పంపించారు.


పరీక్ష రాసి వచ్చేవరకు తండ్రి మృతదేహం తీసు కెళ్లబోమని చెప్పడంతో బాధతో పరీక్షా కేంద్రానికి వెళ్ళింది. గుండె నిండా ఆవేదనతోనే…పరీక్ష రాసి తిరిగి ఇంటికి వచ్చింది. తండ్రికి అన్ని తనై అంత్యక్రియలు చేసి కన్నీటి వీడ్కోలు పలికింది.

ఆమె తండ్రి ఆఖరి వీడ్కోలు పలుకుతూ బోరున విలపిస్తున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment