హ్యూమన్ రైట్స్ టుడే/పెద్దపల్లి జిల్లా/మార్చి 08:
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో శుక్రవారం తెల్లవారు జాము న 4 గంటల సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసు కుంది.
ఈ ప్రమాదంలో జెండా కూడలిలోని ఒక మొబైల్ షాప్, పూజా సామగ్రి దుకా ణం పూర్తిగా దగ్ధమయ్యా యి. వాచ్ షాప్, మరో రెండు దుకాణాలు పాక్షి కంగా దెబ్బతిన్నాయి. విద్యుదాఘాతంతో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అనుమా నిస్తున్నారు.
పెద్దపల్లిలోని అగ్నిమాపక సిబ్బంది వచ్చి సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను ఆర్పివేసింది. సుమారు రూ.60 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు.
సంఘటనా స్థలాన్ని సీఐ కృష్ణ, ఎస్సై లక్ష్మణ్ రావు తదితరులు పరిశీలిం చారు.