ఆరు గ్యారెంటీ పథకాలపై సమీక్షా నిర్వహించిన మండల కాంగ్రెస్ పార్టీ
హ్యూమన్ రైట్స్ టుడే/మహబూబాబాద్ /జనవరి 08: బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండల పార్టీ కార్యాలయంలో బయ్యారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంబాల ముసలయ్య, పట్టణ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ టీపీసీసీ నాయకులు మాజీ ఎంపీపీ గుగులోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో ప్రకటించిన 6 గ్యారంటీలని ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ముఖ్య మంత్రిగా పదవి ప్రమాణం చేసిన 48 గంటలలో రెండు గ్యారంటీలు మొదటిది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రెండవది రాజీవ్ ఆరోగ్య శ్రీ ఐదు లక్షల నుండి పది లక్షలకు పెంపు మిగిలిన 5 గ్యారంటీలను 100 రోజులలో అమలు చేస్తామని చెప్పడం డిసెంబర్ 28 నుండి జనవరి 6 తేదీ 2024 వరకు వారం రోజులపాటు లబ్దిదారుల నుండి ప్రజాపాలన ధరకాస్తులు స్వీకరించడం జరిగింది. బయ్యారం మండలంలో 15776 లబ్దిదారుల నుండి ధరకాస్తులు రావడం జరిగింది. ఈ ధరకాస్తులని ఈ నెల 17వ తేదీ వరకు ఆన్లైన్ చేయడం జరుగుతుంది. ప్రజాపాలన అభయహస్తం ధరకాస్తుదారులు ఎలాంటి మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని ఎవరికి ముడుపులు ఇవ్వకూడదని ఎవరైనా అలాంటి వాళ్ళు వున్నారని తెలిస్తే వెంటనే మండల కాంగ్రెస్ పార్టీ దృష్టికి తీసుకుపోవాలిని మండల కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలను ఆదేశించారు. ఎవరైనా మండలంలో షాడోలు ఎవరైనా ప్రభుత్వ మండల అధికారులు, ఉద్యోగస్తులు, పదోన్నతులు, బదిలీల కొరకు ఏ నాయకున్ని సంప్రదించవద్దని మాకు, మంత్రి తెలుసు, ఎమ్మెల్యే తెలుసు అని మీకు చెబితే వారి బారిన పడి మోసపోవద్దని అలాంటి వి మీద్రుష్టికి వస్తే మండల పార్టీ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో బయ్యారం గ్రామపంచాయతీ సర్పంచ్ ధనసరి కోటమ్మ, జెగ్గుతండా సర్పంచ్ బోడ రమేష్, బయ్యారం 2 ఎంపీటీసీ తమ్మిశెట్టి కుమారి, రామచంద్రపురం ఎంపీటీసీ భూక్యా లక్ష్మి(గణేష్ )రామచంద్రాపురం సర్పంచ్ పోలేబోయిన వెంకటేశ్వర్లు, చర్లపల్లి సర్పంచ్ వట్టం స్వరూప, (సారయ్య) జగత్రావ్ పేట సర్పంచ్ కారం బాస్కర్, అల్లిగూడెం సర్పంచ్, చింత సుబద్రా (ప్రసాద్) మండల మహిళ అధ్యక్షురాలు తగిరి నిర్మలా రెడ్డి, బత్తిని రామ్మూర్తి, రాసామళ్ళ నాగేశ్వర్రావ్, వెంకటపతి, పగడాల శ్రీనివాస్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గౌరీశెట్టి వెంకన్న, బూక్యా రవి నాయక్, మధుకర్ రాజు, పెద్దిని వెంకటేశ్వర్లు, బయ్యారం వార్డు మెంబర్ పోతుగంటి సుమన్, జెగ్గుతండా గ్రామశాఖ అధ్యక్షులు నాగరాజు, నద్దునురి లింగయ్య, ఎస్సి సెల్ మండల అధ్యక్షులు దాసరి శ్రీధర్, అలాగ్జాoడర్, తొట్టి అశోక్ తదితరులు పాల్గొన్నారు.