ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి
హ్యూమన్ రైట్స్ టుడే/కరీంనగర్ జిల్లా/జనవరి 05:
కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది తనను ప్రేమించడం లేదని యువతిపై కత్తితో దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామంలో గురువారం రాత్రి జరిగింది.
కొత్తపల్లి గ్రామంలో తన ఇంటి సమీపంలో ఉన్న ఓ యువతిని ప్రేమ పేరుతో సాయి అనే వ్యక్తి వేధించడమే కాకుండా పెళ్లి చేసుకుంటానని నాలుగు సంవత్సరాలుగా వేధిస్తు న్నాడు.
బాధితురాలు పెళ్లికి నిరా కరించి, పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించింది ఈ క్రమంలో ఒప్పంద పత్రం కూడా రాసుకున్నారు.
కాగా, ఆ యువతి వరంగల్లో ఎంఎస్సీ చదువుకున్న అనంతరం సొంత గ్రామ మైన కొత్తపెళ్లిలోనే ఉంటూ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో బొద్దుల సాయి అసభ్యకరమైన మెసేజ్లు పెడుతూ ఇబ్బంది పెడుతున్నాడు. దీంతో తాను అతడిని ఇంకో వ్యక్తి ద్వారా మందలించింది.
అయినా మాట వినకుండా గురు వారం రాత్రి ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో పెళ్లి చేసుకోవట్లేదని కక్షపెం చుకొని యువతి మీద కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.
తీవ్రంగా గాయపడ్డ యువతిని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయి స్తున్నారు. ఈ మేరకు నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.