కన్నతల్లిని గొడ్డలితోనరికి చంపిన కొడుకు..

Get real time updates directly on you device, subscribe now.

కన్నతల్లిని గొడ్డలితోనరికి చంపిన కొడుకు..

హ్యూమన్ రైట్స్ టుడే/భూపాలపల్లి జిల్లా/జనవరి 05:
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో దారుణం జరిగింది.

సైకో గా మారిన కొడుకు వీరంగంతో ఒక కన్నతల్లి అక్కడికక్కడే మృతిచెందగా మరో మహిళకు తీవ్ర గాయాలతో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా ఆస్పత్రికి తరలించారు.

స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రేగొండ మండలం తిరు మలగిరి గ్రామానికి చెందిన కంచరకుంట్ల రాజిరెడ్డి మతిస్థిమితం లేని వ్యక్తి గురువారం రాత్రి సుమారు 2 గంటల ప్రాంతంలో తన తల్లి కంచరకుంట్ల హైమా వతిని గొడ్డలితో అతికి రాతకంగా నరికి చంపాడు.

గోడువను చూసి బయటికి వచ్చిన ఇంటి పక్కన ఉన్న ఊకంటి లలిత పై దాడి చేయగా తీవ్ర గాయాలై చావు బతుకుల మధ్య ఉంది.

చికిత్స నిమిత్తం ఎంజీఎం కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

తల్లిని చంపి ఇంటి పక్క వారిపై దాడి చేసి పారి పోతుండగా గోరుకొత్తపల్లి మండలం చిన్నకోడపాక గ్రామంలో అనుమానా స్పదంగా తిరుగుతున్న రాజిరెడ్డిని ఆ గ్రామస్తులు దొంగగా భావించి అదుపు లోకి తీసుకొని తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

సంఘటన స్థలానికి చేరు కున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment