తెలంగాణకు రావలసిన నిధులు ఇప్పించండి: సీఎం రేవంత్ రెడ్డి
హ్యూమన్ రైట్స్ టుడే/న్యూఢిల్లీ /జనవరి 05:
తెలంగాణకు అదనంగా ఐపీఎస్ అధికారులను కేటాయించాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం 76 మంది ఐపీఎస్ అధికారు లను మాత్రమే కేటాయిం చారని.. జిల్లాల విభజన, వివిధ శాఖల పర్యవేక్షణ నిమిత్తం రాష్ట్రానికి అదనంగా 29 అదనపు ఐపీఎస్ పోస్టులు కేటా యించాలని కోరారు.
ఢిల్లీలో పర్యటనలో ఉన్న సీఎం గురవారం పలువురు కేంద్రమంత్రులను కలిసి రాష్ట్రానికి రావాల్సిన నిధులు,అభివృద్ధి పనులపై చర్చించారు.
రేవంత్ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి అమిత్ షా,సాను కూలంగా స్పందించారు. 2024లో కొత్తగా వచ్చే ఐపీఎస్ బ్యాచ్ నుంచి తెలంగాణకు అధికా రులను అదనంగా కేటాయిస్తామని హామి ఇచ్చారు.