ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ!

Get real time updates directly on you device, subscribe now.

తెలంగాణ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో ఉత్కంఠ.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/జనవరి 05:
ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎంపిక‌పై కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోన్నది. పార్టీలో క్రీయాశీలకంగా పనిచేసిన నేతల వివరాలను ఏఐసీసీ సేకరిస్తున్నది. దాదాపు 15 మంది కీలక నేతలు ఎమ్మె ల్సీ పదవుల కోసం పోటీ పడుతున్నట్లు పార్టీలో చర్చ జరుగుతున్నది.


అయితే అసెంబ్లీ టిక్కెట్‌ను త్యాగం చేసినోళ్లకు అవకా శం ఇస్తారా? పోటీ చేసి ఓడిన ప్రముఖులకు కేటాయిస్తారా? అనేది త్వరలోనే తేలనున్నది. ఎమ్మెల్యే కోటాలో రెండు ఎమ్మెల్సీలు ఖాళీ అవగా, ఇప్పుడు ఆ రెండింటికీ ఆశావహులు పోటీపడు తున్నారు.


దీంతో కాంగ్రెస్ ఇద్దరి అభ్యర్ధులను నిలబెడు తుందా? ఒక్కరినే పోటీ లో ఉంచుతుందా? అని పార్టీ నేతల్లో ఉత్కంఠ నెలకొన్న ది. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ల సంఖ్య ప్రకారం కాంగ్రెస్ ఒక ఎమ్మెల్సీని సులువుగా గెలుస్తుంది.

తమకూ ఒక ఎమ్మెల్సీ వస్తుందని బీఆర్ఎస్ ధీమాను వ్యక్తం చేస్తున్నది. అయితే రెండింటినీ తామే గెలవాలని కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పట్టుపడు తున్నారు.

ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యతో రెండింటినీ గెల వడం కష్టమే. కానీ ఇతర పార్టీ ఎమ్మెల్యేల మద్ధతు కూడగడితే రెండు ఎమ్మెల్సీ లను సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ గానూ పలువురి ఎమ్మెల్యేలతో సంప్రదింపు లు చేస్తున్నట్లు తెలిసింది.

ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఇదే హాట్ టాఫిక్ గా మా రింది. సీఎం రేవంత్ ఢిల్లీ నుంచి రాగానే ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపికపై క్లారిటీ రానున్నదని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇక ఈ నెల 14వ తేదీన సీఎం రేవంత్ పెట్టుబడుల నిమిత్తం దావోస్‌కు వెళ్ల నున్నారు. ఆ లోపే ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించి, తర్వాతి ప్రాసెస్ బాధ్య తలను పార్టీలోని కీలక నేతలకు అప్పగించను న్నట్లు తెలుస్తుంది.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment