స్కూల్ బస్సు కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి

Get real time updates directly on you device, subscribe now.

స్కూల్ బస్సు కిందపడి రెండేళ్ల చిన్నారి మృతి..

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ జనవరి 04:
స్కూల్ బస్సును నడిపే డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఎన్నో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో అప్రమత్తమైన అధికారులు కండీషన్ లేని బస్సులపైనా, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న బస్సు డ్రైవర్లపైనా, వారిని కిరాయికి తీసుకున్న స్కూల్ యాజమాన్యంపైనా చర్యలు తీసుకుంటున్న డ్రైవర్ల ధోరణి మాత్రం మారడం లేదు.

డ్రైవర్ల నిర్లక్ష్యం అమాయకుల ప్రాణాలు బలవుతున్నాయి. ఉస్మాని యా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు టైర్ కింద పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన హబ్సిగూడ రవీంద్రనగర్ లో ఈరోజు ఉదయం చోటుచేసుకుంది.

హబ్సిగూడ రవీంద్రనగర్‌లో నేటి ఉదయం తమ బాబు ని జూన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు ఎక్కిస్తుండగా, పక్కనే అమ్మమ్మ చేతిలో ఉన్న రెండేళ్ల చిన్నారి కిందికి జారి తెలియకుండానే బస్ టైర్ కిందకి పడిపోయింది.

అమ్మమ్మ చూసే లోపే ఘోరం జరిగిపోయింది. బస్సు ఆపాలని పిలిచేలోపే చిన్నారిపై బస్సు టైరు వెల్లింది పాప టైరు కింద ఉండటంతో.. బస్ డ్రైవర్ గమనించలేదు, బస్‌ను ముందుకు తీయడంతో చిన్నారి టైర్ కింద పడి అక్కడికక్కడే చనిపో యింది.

డ్రైవర్ నిర్లక్ష్యంతోనే పాప చనిపోయిందని, కుటుంబ సభ్యులు ఆందోళన చేప ట్టారు. విషయం తెలుసు కున్న ఓయూ పోలీసులు చిన్నారి మృతదేహాన్ని గాంధీకి తరలించారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment