సైబర్ నేరాల పట్ల విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి:ఎస్సై కిరణ్ కుమార్..
హ్యూమన్ రైట్స్ టుడే/పెద్దపల్లి జిల్లా/జనవరి 03:
సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, విద్యార్థులు తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని మంథని ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు.
రామగుండం పోలీస్ కమిషనర్ రేమా రాజేశ్వరి ఆదేశాల మేరకు మంథని సీఐ సతీష్ సూచనల మేరకు సైబర్ జాగృతి దివాస్ కార్యక్రమంలో భాగంగా బుధవారం మంథని పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల బాలురు యందు ఎస్ఐ కిరణ్ కుమార్ విద్యార్థులకు సైబర్ నేరాలపట్ల ఎలా జాగ్రత్తగా ఉండాలో అవగా హనను కల్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనవసరపు సందేశాలకు స్పందించొద్దని, ఆన్లైన్ గేమ్ లు, లోన్ ఆప్ లా పట్ల అప్రమత్తంగా ఉంటూ, తల్లిదండ్రులకు తెలియజేయాలని ఆయన సూచించారు.
ఉచితాలు అంటూ వచ్చే మెసేజ్లకు స్పందించి డబ్బు పోగొట్టుకున్న వారు చాలా మంది బాధితులు ఉన్నారని, ఎట్టి పరిస్థితుల్లో ఉచితాలు అనే వచ్చే లింకులు ఓపెన్ చేయకూడదని ఆయన వివరించారు.
ఎక్కువ డబ్బు ఆశ చూపించి మోసం చేసే అనేక ఆన్లైన్ కంపెనీలు ఉన్నాయని వాటి పట్ల అవగాహనతో ఉండాల ని ఆయన తెలిపారు. సైబర్ నేరాలు విపరీతంగా పెరుగు తున్న పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉంటూ తెలియని వారికి తెలియ చెప్పాలని, స్మార్ట్ ఫోన్ ఉపయోగించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలని ఆయన అన్నారు.
ఫోటోలు మార్ఫింగ్ చేసే అవకాశం ఉన్నందున అమ్మాయిలు చాలా జాగ్రత్తగా సోషల్ మీడియాను ఉపయోగించు కోవాలని ఆయన పేర్కొన్నారు.
తప్పు ఎవరు చేసిన తప్పించుకోలేరని, బ్లాక్ మెయిల్ చేసిన, ఫోటోలు మార్నింగ్ చేసిన దొరుకు తారని ఆయన పేర్కొన్నా రు. ఏదైనా వస్తువు కొన్నప్పుడు స్కాన్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు పరిశీ లించుకుని స్కాన్ చేసి డబ్బులు చెల్లించాలని, అనవసరం అయినచోట స్కాన్ చేస్తే అకౌంట్లు డబ్బులు మాయమైన సందర్భాలు ఉన్నాయని ఆయన వివరించారు.
ఈజీ మనీ కి ఆశపడి, సంపాదించుకున్న వాటిని పోగొట్టుకోకూడదని ఆయన తెలిపారు. సంఘటన జరిగిన వెంటనే సైబర్ వద్ద స్పందించి ఫిర్యాదు చేస్తే పోగొట్టుకున్న డబ్బులు తిరిగి పొందే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ 1930, సైబర్ క్రైమ్ వాట్సాప్ నెంబర్ 8712672222 ఫిర్యాదు చేయవచ్చని ఆయన వివరించారు.
ఈ అవగాహన కార్య క్రమంలో ప్రిన్సిపాల్ వెంకట్రామిరెడ్డి, వైస్ ప్రిన్సిపల్ మహేష్, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ రాజు, ఎస్ఐ రాణి వర్మ, హెడ్ కానిస్టేబుల్ రాజేశం, సిబ్బంది సంతోష్ కుమార్, మహేందర్, మహేష్, కళాశాల సిబ్బంది విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.