హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్ / జనవరి 03: సుప్రీం కోర్టు తీర్పు అమలుకోసం AP రాష్ట్రం జారీచేసిన GO MS no.188, PR Dept DTD.21-Jul-2011, ప్రకారం పంచాయతీ ఆస్తుల పరిరక్షణ కమిటీ లో జిల్లా కలెక్టర్ చైర్మన్ గా వున్నారు. కానీ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లా లో కూడా సదరు కమిటీ పని చేయలేదు. దీనికి పూర్తి బాధ్యత ఆయా జిల్లాల కలెక్టర్లు గా పనిచేసిన ఐఏఎస్ అధికారులదే. వారి విధుల్లో నిర్లక్ష్యం వలన గత 10 సంవత్సరాలుగా రాష్ట్రంలో సామూహిక వనరులు ఆక్రమణకు గురికావడంనీటి వనరులు విధ్వంసానికి గురి కావడం జరిగినది. ఐఎఎస్ అధికారుల విధుల్లో నిర్లక్ష్యం వలన కోట్లాది ప్రజల జీవన ప్రమాణాలు దిగజారి పోయాయి. వీరు చేసిన నష్టాన్ని కోర్టు పరిగణించి ఉండాల్సింది ఏదైనా శిక్ష విధించి ఉండాల్సింది. లక్షలాది రూపాయల ప్రజాధనం జీతం రూపంలో పొంది, అనేక కోట్ల రూపాయలు భత్యం, కార్లు, బంగళా సిబ్బంది కలిగి ఉన్నత స్థానాల్లో వున్న వారు కీలక విధుల్లో నిర్లక్ష్యాన్ని సహించ రాని విషయం ఇది కచ్చితంగా కోర్టు ధిక్కరణ సుప్రీంకోర్టు వారు మరల ప్రజావాజ్యం సేకరించి ఒక సుమోటో కేసుగా దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర నీతి నిజాయితీ గల అధికారులను నియమించి సమగ్ర దర్యాప్తు చేయించి, కఠినంగా శిక్షించాలి.