గ్రామ వాట్సాప్ గ్రూపులో న్యూ ఇయర్ విషెస్ పోస్టు పెట్టినందుకు ఇంటికి వచ్చి మరీ కొట్టిన కాంగ్రెస్ నాయకులు..
హ్యూమన్ రైట్స్ టుడే/సూర్యాపేట/జనవరి 03:
సూర్యాపేట – తుంగతుర్తి నియోజకవర్గంలోని జాజిరెడ్డి గూడెం మండలం కోమటిపల్లిలో న్యూ ఇయర్ సందర్భంగా విషెస్ చెప్తూ కేటీఆర్, మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ ఫోటోలు జత చేసి గ్రామ వాట్సాప్ గ్రూపులో మహేష్ అనే బీఆర్ఎస్ కార్యకర్త పోస్టు చేయగా గ్రామ సర్పంచ్ మరియు కాంగ్రెస్ నాయకుడు జూల నర్సయ్య మహేష్ ఇంటికి వెళ్లి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. ఆడుకోబోయిన మహేష్ తల్లి వీరమ్మ, తమ్ముడు శ్రావణ్ మీద సైతం దాడి చేశారు.