జిల్లా పోలీస్ కమిషనర్ ని కలిసిన విద్యార్ధి JAC నాయకులు..
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/జనవరి 02: నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ షింగినేవార్ ని నిజామాబాద్ జిల్లా తెలంగాణ విద్యార్ధి ఉద్యమ (JAC) నాయకులు కలిసి, విద్యార్థి ఉద్యమకారుల కేసుల వివరాల కోసం వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సంధర్భంగా విద్యార్ధి జేఏసీ అధ్యక్షులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినా హామీ 250చ.ఆడుగుల ఇంటి స్థలంతో పాటు ఉద్యమ సమయంలో కేసుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగం రాలేదు అలాగే వయోపరిమితి దాటిపోయింది. కావున అధికారిక పెన్షన్ ప్రకటించి తెలంగాణ ఆవిర్భావం అయిన జూన్ 2న ప్రభుత్వ లాంఛనాలతో ఉద్యమ కారులను సన్మానించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వవాన్ని విజ్ఞప్తి చేస్తున్నామని అన్నారు. అనంతరం నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సానుకూలంగా స్పందించి అతి త్వరలో కేసుల వివరాలు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగిందనీ అన్నారు. ఈ కార్యక్రమంలో పుప్పాల రవి, పులి జైపాల్, గంగన్ అన్వేష్, మేత్రి రాజశేఖర్, సల్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.