బైరి నరేష్‌ను అడ్డుకున్న అయ్యప్ప, శివ స్వాములు
హ్యూమన్ రైట్స్ టుడే/ములుగు/హైదరాబాద్ /జనవరి 02: ములుగు జిల్లా ఏటూరునాగారంలో – భీమాకోరేగామ్ స్ఫూర్తి దినం సందర్బంగా బిఆర్ పంక్షన్ హాల్లో జరిగే కార్యక్రమానికి ముఖ్య అధితిగా హాజరవుతున్నారని తెలుసుకున్న అయ్యప్ప, శివ స్వాములు బైరి నరేష్‌ను అడ్డుకున్నారు.
అయ్యప్ప స్వామిని దూషించిన నువ్వు ఇక్కడ నుండి వెల్లి పోవాలని డిమాండ్ చేసారు.
వారి నుండి తప్పించుకునే క్రమంలో వాహనంతో గుద్దడంతో అయ్యప్ప స్వామి పోగు నర్సింగరావుకు కాలు విరిగగా మిగతా వారు గాయపడ్డారు.
పోలీసుల నుండి తప్పించుకునే క్రమంలో వాహనంలో పారిపోతుండగా నరేష్ వాహనం బోల్తా పడింది.