ఇంకా ఎంతమంది అమాయక ప్రజల ప్రాణాలు పోతే వైద్యాధికారులు మేల్కొంటారు?
వైద్యం వికటించి వ్యక్తి మృతి..
సైనా సైటిస్ సర్జరీ చేసి ప్రాణం తీశారని కుటుంబ సభ్యుల ఆందోళన..
ఎంత మంది ప్రజల ప్రాణాలు తీస్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాదితులు..
ప్రైవేట్ ఆస్పత్రిలో సర్జరీ చేసి పరిస్థితి విషమించక ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు..
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్ /డిసెంబర్ 01: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని దివ్య ఆసుపత్రిలో కేశంపెట మండలం కొత్త పెట్ గ్రామానికి జుకుట్ల నర్సింలు అనే వ్యక్తి వైద్యం వికటించి మృతి చెందినట్లు బాధిత కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో డెడ్ బాడీ తో ఆందోళనకు దిగారు. సైనా సైటిస్ సర్జరీ సమస్య కు సర్జరీ చెయ్యడంతో వైద్యం వికటించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సుమారు లక్ష రూపాయల దాకా డబ్బులు తీసుకుని ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేసి పరిస్థితి విషమించకా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లామన్నారని ఇలాంటి ప్రైవేట్ ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దివ్య ప్రైవేటు ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. కుటుంబ సభ్యులు రాజకీయ అండదండలు అడ్డం పెట్టుకొని నిర్లక్ష్యంగా వైద్యం చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలు తీశారని ఇప్పటివరకు ఇదే ఆసుపత్రిలో ఎంతోమంది మహిళలు ప్రజలు చిన్నారులు సైతం ప్రాణాలు తీసిన ఘటనలుగా ఉన్న వైద్యశాఖధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.