నల్లగొండ జిల్లాలో ప్రేమజంట ఆత్మహత్య
హ్యూమన్ రైట్స్ టుడే/నల్లగొండ జిల్లా/డిసెంబర్ 31:
తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసు కున్న ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
మిర్యాలగూడ వద్ద రైలు కిందపడి ప్రేమికులు ఆత్మ హత్య చేసుకున్నారు. రైల్వే పోలీసుల ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు.
ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచార మిచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుుకొని దర్యా ప్తు చేస్తున్నారు.
ప్రేమ వ్యవహారాన్ని పెద్దలు వ్యతిరేకించడంతోనే ఆత్మ హత్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతుల వివరాలు తెలి యాల్సి ఉంది.