హ్యూమన్ రైట్స్ టుడే/ మహబూబాబాద్ /మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలము మత్య వృత్తి రక్షణ ర్యాలీ ఏజెన్సీ ప్రాంతంలోని ముదిరాజ్ మత్స్య కార్మికుల హక్కుల రక్షణ కోసం ఈ నెల 20న ముదిరాజ్ వృత్తి రక్షణ ర్యాలీ నిర్వహించటం జరుగుతుందని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి రాష్ట్ర జాయింట్ యాక్షన్ కమిటీ సభ్యులు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ పిలుపునిచ్చారు.
మంగళవారము నాడు గూడూరు మండల కేంద్రంలో జరిగిన ముదిరాజుల ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
గూడూరు కొత్తగూడ గార్ల బయ్యారము మండలములలోని ముదిరాజ్ మధ్య కార్మికులు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని 1964 లో తీసిన జీవో ప్రకారము ముదిరాజులు మత్స్య కార్మికులు గా ఉన్నారని కానీ ఈ ప్రాంతంలో 1/70 యాక్ట్ కంటే ముందు ఏర్పడిన మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో కూడా చేపలు పట్టుకొని ఇవ్వటం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము కూడా అధికారులు వ్యవహరించటం లేదని అన్నారు ప్రభుత్వ జీవోలను రాత్రికి రాత్రి మార్చి చేపలు పట్టే వృత్తికి ముదిరాజులను దూరం చేస్తున్నారని అన్నారు దీని కొరకు తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు శాసనమండలి సభ్యులు డాక్టర్ బండ ప్రకాష్ ముదిరాజ్ సహకారంతో రాష్ట్రములో ఉన్న ముదిరాజుల వృత్తిరక్షణ చర్యలను చేపట్టటం జరిగింది అని అన్నారు. దానిలో భాగంగా గూడూరులో జరిగే ఈ ర్యాలీకి పెద్ద ఎత్తున ముదిరాజులు తరలిరావాలని కోరారు. గూడూరు, కొత్తగూడ, గార్ల, బయ్యారం మండలాలలో ముదిరాజ్ మత్స్యకార్మికుల వృత్తి రక్షణ ర్యాలీని ఈనెల 19న గూడూరు మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. గౌరవ హైకోర్టు తీర్పు, పిసా చట్టం నియమ నిబంధనలు అనుగుణంగా ముదిరాజ్ మత్స్యకార్మికులకు అందవలసిన ఫలితాలు అందకుండా చేసే దానిపై ముదిరాజ్ మత్స్య కార్మికులు సంఘటితంగా, ఏకంగా నిరసన తెలపవలసిన అవసరం ఏర్పడింది. 1/70 యాక్ట్ రాకముందు ఉన్న మత్స్య పారిశ్రామిక సహకార సంఘాలలో చేపలు పట్టే హక్కు ఉన్నప్పటికీ దానిని నిరోధించడమే కాకుండా, మాడ గ్రామాలలో కూడా ముదిరాజ్ మత్స్యకార్మికులను చేపలు పట్టకుండా ఆపుతున్న దానిపై నిరసన వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. ఒకవైపు గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికి గిరిజనులకు మేలు జరపాలని ఉద్దేశంతో కుట్రతో జీవో ఎంఎస్ 6 ను తీసుకు వచ్చిన దానిపై కూడా నిరసన వ్యక్తం చేయవలసిన అవసరం ఉంది. అటవీ హక్కుల చట్టానికి లోబడి 1/70 యాక్ట్ కు అనుగుణంగా పీసా చట్టం ప్రకారం నడుచుకొనుటకు ముదిరాజ్ మత్స్య కార్మికులు సిద్ధంగా ఉన్నప్పటికీ గౌరవ హైకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ ముదిరాజ్ మత్స్య కార్మికులను నిరాదరణకు గురు చేస్తున్న దానిపై ఈ నెల 19న గూడూరు మండల కేంద్రంలో ఉదయం 9 గంటలకు భారీ ర్యాలీ నిర్వహించుటకు నిర్ణయించడం జరిగింది ఈ ర్యాలీలో తెలంగాణ ముదిరాజ్ మహాసభరాష్ట్ర కార్యదర్శి గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ గారు తెలంగాణ ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు చిల్లా సహదేవ్ ముదిరాజ్ కార్యనిర్వాక అధ్యక్షులు కాటా భాస్కర్ ముదిరాజ్ తో పాటు జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా కార్యదర్శులు జిల్లా ప్రచార కార్యదర్శులు జిల్లా కార్యవర్గ సభ్యులు మరియు జిల్లాలోని మండల అధ్యక్ష కార్యదర్శులు జిల్లాలోని అన్ని గ్రామాల మత్స్య పారిశ్రామిక సహకార సంఘాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొననున్నారు. గూడూరు కొత్తగూడ బయ్యారం మండలాలకు చెందిన ముదిరాజ్ అందరు పెద్ద ఎత్తున తరలి రావాలని తెలంగాణ ముదిరాజులు మహాసభ మహబూబాబాద్ జిల్లా పాలకవర్గం పిలుపునిస్తున్నాము. ఈ సమావేశానికి గూడూరు మండల అధ్యక్షులు పాండవుల మల్లయ్య అధ్యక్షత వహించగా కొత్తగూడ మండల అధ్యక్షులు అశోక్, పో గుళ్లపల్లి ఎంపీటీసీ భైరబోయిన సదానందం, కార్యదర్శి అల్లాడి రాజ్ కుమార్, దుస్స జంపయ్య,చిక్కుల వెంకన్న,గూడూరు కుల పెద్దమనిషి బండారి కుమారస్వామి మొదలగు వారు పాల్గొన్నారు.