మందుబాబులకు నూతన సంవత్సర గుడ్ ఆఫర్
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 31:
మందుబాబులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. రెండురోజుల పాటు మద్యం దుకాణాలను 12గంటల వరకు తెరిచి ఉంచనున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.
ఇటు తెలంగాణ, అటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్ధ రాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది.
ఇవాళ, రేపు రెండు రోజు లపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని మద్యం షాపులు అర్ధరాత్రి 12 గంటల వరకు పనిచేస్తా యని తెలిపింది.
బార్లు క్లబ్బులు పర్మిషన్తో జరిగే ఈవెంట్లలో ఒంటి గంట వరకు మద్యం విక్ర యాలకు పర్మిషన్ ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఎక్సైజ్ శాఖ. దీంతో మందుబాబు లు పండుగ చేసుకుంటు న్నారు.