గురితప్పిన గులేరు..అపై జైలుకు..
హ్యూమన్ రైట్స్ టుడే/జనగామ జిల్లా/ డిసెంబర్ 31:
గురితప్పిన గులేరు ఓ వ్యక్తిని జైలు పాలు చేసింది. పిట్టను కొట్టబోయి గురితప్పి వందే భారత్ ట్రైన్ కిటికీ అద్దం పగులగొట్టడంతో రైల్వే పోలీసులు వ్యక్తిని అరెస్టు చేసి జైలుకు తరలించారు.
వివరాల్లోకి వెళితే.. జనగామ పట్టణం అంబేడ్కర్ నగర్‌కు చెందిన హరిబాబును వందే భారత్ ట్రైన్‌పై రాళ్లు విసిరిన కేసులో రైల్వే పోలీసులు అరెస్టు చేశారు.
ఆర్పీఎఫ్ సీఐ సంజీవరావు కథనం ప్రకారం.. జనగామకు చెందిన హరిబాబు పిట్టలను కొట్టి వాటిని ఆహారంగా తీసుకుంటుంటారు.
ఈ నేపథ్యంలో జనగామ సమీపంలో శుక్రవారం మధ్యాహ్నం పిట్టలు కొట్టడానికి గులేరుతో ప్రయత్నించాడు.అయితే అదిగురితప్పి..పొరపాటున విశాఖపట్నం నుంచి హైదరా బాద్ వెళుతున్న 20833 నంబరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌కు తగిలింది.
ఈ ఘటనలో ట్రైన్ కిటికీ అద్దం పగిలింది. కేసు నమోదు చేసుకున్న ఆర్పీఎఫ్ పోలీసులు.. సంఘటన జరిగిన పరిసర ప్రాంతాల్లో విచారించగా హరిబాబు చేసిన పని అని తేలింది. గులేరును సీజ్ చేసి అతడిని అరెస్టు చేసిశనివారం సాయంత్రం జైలుకు పంపించారు.
గులేరు గురితప్పి పొరపాటు న వందే భారత్ ట్రైన్‌కు తగిలిందని అందులో తన తప్పేమీ లేదని బాధితుడు వాపోయాడు.