సినీ నటి జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ
హ్యూమన్ రైట్స్ టుడే/ఉత్తర ప్రదేశ్/డిసెంబర్ 31:
మాజీ ఎంపీ, సీనియర్ నటి జయప్రదపై ఉత్తరప్రదేశ్ రాంపూర్ కోర్టు నాన్ బెయి లబుల్ వారెంట్ జారీ చేసింది.
2019లో ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిం చిన కేసులో న్యాయస్థానం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. విచారణకు హాజరు కావా లని కోర్టు పలుమార్లు జయ ప్రదకు నోటీసులు ఇచ్చినా ఆమె హాజరు కాలేదు.
దీంతో న్యాయస్థానం జయ ప్రదపై అరెస్టు వారెంట్ జారీ చేసింది. జనవరి 10లోగా కోర్టు ముందు ప్రవేశపెట్టా లని పోలీసులను ఆదేశించింది.