హైదరాబాదులో భారీగా డ్రగ్స్ పట్టివేత
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 31:
ఇయర్ సందర్భంగా హైదరాబాద్ పోలీసులు డ్రగ్స్‌పై డేగ కన్ను పెట్టారు. సమాచారం అందించే చాలు టక్కున వాలి పోతున్నారు. డ్రగ్స్‌ను గుర్తిస్తున్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే వారం రోజులుగా హైదరాబాద్‌లో పలు చోట్ల భారీగా డ్రగ్స్ గుర్తించారు.మరికొన్ని గంటల్లో భాగ్యనగర వాసులు న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోను న్నారు.
ఈ నేపథ్యంలో డ్రగ్స్‌పై తనిఖీలు మరింత ము మ్మరం చేశారు. ప్లబ్‌లు, క్లబ్బులు, రెస్టారెంట్లు, బార్లు, ఇలా అనుమానం వచ్చిన ప్రతి ప్రాంతంలో రైడ్స్ నిర్వహిస్తున్నారు.
తాజాగా జూబ్లీహిల్స్‌లో సోదాలు నిర్వహించారు. 100 గ్రాముల కొకైన్‌తో పాటు 29 ప్యాకెట్ల బ్రౌన్ షుగర్‌ను స్వాధీనం చేసు కున్నారు.
ఏపీలోని తెనాలి, ఒంగోలు కు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు. వీరి నుంచి మరింత సమాచారం రాబడుతున్నారు.