విద్యా మండలి లో పాతవారినే కొనసాగించండి:సీఎం రేవంత్ రెడ్డి
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 31:
తెలంగాణ ఉన్నత విద్య మండలిపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల పాటు పాత వాళ్లనే చైర్మన్, వైస్ చైర్మన్‌లుగా కొనసా గించాలని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
కొత్త వారిని నియమించే వరకు లింబాద్రి, వెంకట రమణ లను కొనసాగిం చాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసింది.
కాగా గత ప్రభుత్వంలో నియమించబడిన వారిని కాంగ్రెస్ ప్రభుత్వం తొలగిం చింది. బీఆర్ఎస్ ప్రభుత్వం నియమించిన వారిని నెల రోజుల కిందట వివిధ కార్పొరేషన్లు, నామినేషన్ల పదవికాలం పొడిగింపు రద్దు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఈ మేరకు నిర్ణయం తీసుకు న్నారు.
అయితే ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాల్సిన సమయంలో ఉన్నత విద్య మండలి చైర్మన్, వైఎస్ చైర్మన్‌లు ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తూ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.