హై రిస్క్ గర్భవతుల ప్రసవానికి మెడికల్ ఆఫీసర్ ల దే రవాణా భాధ్యత..

Get real time updates directly on you device, subscribe now.


ఈ నెల 19 నుండి 24 వరకు ఆధార్ అప్ డేట్ కు అవకాశం.

ముఖ ఆధారిత హాజరు (FRS)తప్పనిసరి :- జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి.


ఆంధ్ర ప్రదేశ్/ తిరుపతి జిల్లా/ హ్యూమన్ రైట్స్ టుడే న్యూస్ ప్రతినిధి:-

తిరుపతి, జనవరి 17: జిల్లాలో హై రిస్క్ గర్భవతుల ప్రసవ భాధ్యత తో పాటు రవాణా ఎర్పాటు పి హెచ్. సి. మెడికల్ ఆఫసర్లు చూడాలని 108 అందుబాటులో కి రాకపోతే ప్రవేట్ వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాలని ఇందుకోసం రూ.10 వేలు వంతున పి హెచ్ సి లకు కేటాయించామని జిల్లా కలెక్టర్ కె. వెంకటరమణా రెడ్డి ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్ నుండి జిల్లాలోని డివిజన్, మండల స్థాయి అధికారులతో కో – ఆర్డినేశన్ సమావేశం జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు సూచనలు చేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ హై రిస్క్ గర్భవతుల పై మెడికల్ ఆఫీసర్ లు ప్రత్యేక దృష్టి పెట్టాలని మాతృ శిశు మరణాలు అనేది జిల్లాలో ఒక్కటీ జరగరాదని తెలిపారు. సి. డి., ఎన్. సి. డి. సర్వే తరచూ నిర్వహించాలని ఏ ఎన్ ఎం లు కనీసం 10 ఐ డి లకు తక్కువ సర్వే వుండాలని అన్నారు. అనీమియా గుర్తించిన వారి సంపూర్ణ పోషణ పుడ్ సరిగా అందుతున్నదా లేదా పర్యవేక్షణ వుండాలని అన్నారు. అంగన్ వాడి లో పిల్లలు బరువు, పొడవు తక్కువ , రక్తహీనత తప్పనిసరి పరీక్షలు చేసి గుర్తించి వారి బాలమృతం కచ్చితంగా అందాలని అన్నారు. సచివాలయం పరిధిలో 0-5 పిల్లలు, గర్భవతులు లిస్ట్ అందుబాటు లో వుండాలి అన్నారు.

ఇక పై తహశీల్దారు లు , ఎం డి ఓ లు సచివాలయ పరిశీలనలో అంగన్వాడి, ఏ ఎన్ ఎం ల పనితీరు పరిశీలించాలి అన్నారు.

సచివాలయం సిబ్బంది పర్యటనలో సమస్యలు గుర్తించి యాప్ లో అప్ లోడ్ చేసిన విద్యాశాఖకు సంబంధించి పాఠశాలల్లో త్రాగునీరు, మరుగుదొడ్లు , విద్యుత్ వంటివి ఎం ఈ ఓ , ఎం. పి. డి. ఓ లు బాధ్యతతో సకాలంలో పరిష్కారం చూపాలని అన్నారు. హిమోగ్లోబిన్ పరీక్షలు ఇంకా 120 స్కూల్ లలో పరీక్షలు జరగాలి , ఈనెల 19 న పాఠశాలలు ప్రారంభమవుతాయి రెండు రోజుల్లో పూర్తి కావాలి అన్నారు. ఇప్పటి వరకు 110 మంది వున్నారు అదనంగా చిక్కీలు , ఇతర కావలసినవి అందిస్తే తగ్గించ గలుగుతాము అన్నారు. తమ వంతు భాద్యతగా అధికారులు ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం పై దృష్టి పెట్టాలని అన్నారు.

జలజీవన్ మిషన్ పనులు ఇంజనీరింగ్ అధికారులు పెండింగ్ లేకుండా చూడాలని అన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత భవనాలు త్వరగా పూర్తి కావాలి అన్నారు. సచివాలయాలకు అనుబంధంగా
కమ్యూనిటీ కాంప్లెక్స్ స్థలాలు కేటాయింపు , నిర్మాణాలపై దృష్టి పెట్టాలని అన్నారు.

ఏ పి ఐ ఐ సి సి కి అప్పంగించిన భూముల 12000 ఎకరాలు జి ఓ లు వచ్చినా ఇంకా పేరు మారలేదు , మ్యుటేషన్ పూర్తి కావాలని లేదంటే పరిశ్రమల స్థాపనకు ఇబ్బంది అవుతుంది వారంలో పూర్తి కావాలని అన్నారు.

టిడ్ కో , జగనన్న గృహాల కు అవసరమైన రుణాలు మంజూరు కు డి ఆర్ డి ఎ, డ్వామా అధికారులు దృష్టి పెట్టాలని అన్నారు.

ఆధార్ క్యాంప్ లో ఉద్యోగస్తులు అప్ డేట్స్ చేసుకునేలా చూడాలి , పుట్టిన పిల్లల ను ఆరోగ్యశ్రీ నమోదు చూడాలని అన్నారు.

గ్రామాలలో వున్న నిరుద్యోగ యువత ను సచివాలయంలో ప్రవేట్ ఉద్యోగ అవకాశాలు కు నమోదు చూడాలని అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా అవకాశం వుంది అన్నారు. సచివాలయం హాజరు శాతం తక్కువ వుంది అన్నారు. పౌర సేవలు పెంచాలి అన్నారు. ఉద్యోగులు నేటి నుండి FRS(ఎఫ్ ఆర్ ఎస్) హాజరు వేయాలి అన్నారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ శ్రీనివాస రావు , ఆర్డీఓ కిరణ్ కుమార్ జిల్లా అధికారులు, కలెక్టరేట్ నుండి పాల్గొనగా డివిజన్, మండల స్థాయి నుండి డివిజన్ స్థాయి అధికారులు, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment