అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసుల మృతి

Get real time updates directly on you device, subscribe now.

*అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అమలాపురం వాసుల మృతి..!*

హ్యూమన్ రైట్స్ టుడే/టెక్సాస్‌ : అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. టెక్సాస్‌ హైవేలో జరిగిన ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు మృతిచెందినట్లు తెలుస్తోంది.

అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.

జాన్సన్‌ కౌంటీలో ఉన్న 67వ నంబరు హైవేపై మినీవ్యాన్‌ను ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమలాపురం వాసులుగా తెలుస్తోంది. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పరిస్థితి ఎలా ఉందన్నది ఇంకా తెలియరాలేదు.

ఈ ప్రమాదంపై తానా సభ్యులు మాట్లాడుతూ.. బాధిత కుటుంబానికి అవసరమైన సాయం అందిస్తామని తెలిపారు. అధ్యక్షుడు శృంగవరపు నిరంజన్‌ సూచన మేరకు తానా ట్రెజరర్‌ అశోక్‌ కొల్లా, ఫౌండేషన్‌ ట్రెజరర్‌ పోలవరపు శ్రీకాంత్‌.. ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment