విద్యార్థులకు సువర్ణ అవకాశం..
ఆంగ్ల అంతలజి లో పద్యాలు, కథలు ప్రచురిస్తాం..
హ్యూమన్ రైట్స్ టుడే/నిజామాబాద్/డిసెంబర్ 23:
విద్యార్థుల సృజనాత్మకతను ఆంగ్ల నైపుణ్యంను పెంపొందించడానికి పద్యాలు, చిన్న కథలు రాయడం ఎంతో దోహద పడుతుందని ఈ ఉదేశ్యంతోనే ఆంగ్ల అంతలజిని ముద్రించనున్నామని ఆంగ్ల ఉపాధ్యాయుడు, పోయిట్ చంద్ర శేఖర్ పెందోటి ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల పాఠశాల విద్యార్థులు, ఇంటర్ విద్యార్థులు, డిగ్రీ పీజీ విద్యార్థులు అర్హులని, ఆంగ్ల పద్యాన్ని కనీసం 4 స్టాంజాలు ఉండాలని అలాగే చిన్న కథ రాసి టెక్స్ట్ రూపంలో వాట్సప్ కు పేరు, పద్యం/కథ పేరు, తరగతి, పాఠశాల/కలశాల పేరు, చిరునామా ను పంపాలని, మీరు రాసిన పద్యాలు, కథలు 31 డిసెంబర్ 2023 లోపు పంపాలని ఇతర వివరాలకు 9550469917 వాట్సాప్ నంబరుకు సంప్రదించాలని తెలిపారు.