ఏసీబీ డీజీగా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్

Get real time updates directly on you device, subscribe now.

తెలంగాణ ఏసీబీ డీజీగా సివీ ఆనంద్ నియామకం.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 23:
తెలంగాణ రాష్ట్ర‌ ఏసీబీ డీజీగా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్ శనివారం బాధ్యతలు స్వీకరించారు.

రెండేళ్లపాటు హైదరాబాద్ సీపీగా పని చేసిన ఆయన ను కాంగ్రెస్ ప్రభుత్వం ఏసీబీ డీజీగా నియమించింది.

ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు బాధ్యతలను స్వీక రించారు. ఆయనకు ఏసీబీ కార్యాలయ సిబ్బంది, ఇతర ఉద్యోగులు శుభా కాంక్షలు తెలిపారు.

ఈ మేరకు సీవీ ఆనంద్ ట్వీట్ చేశారు. రెండేళ్ల పాటు హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా తాను కొనసాగానని ఆయన పేర్కొన్నారు.

శాంతిభద్రతలను పటిష్ఠంగా ఉంచానని పేర్కొన్నారు. అది తనకు వృత్తిపరంగా చాలా సంతృప్తిని ఇచ్చిం దన్నారు. ఒకేసారి అన్ని రకాల పండుగలు వచ్చిన ప్పటికీ…ఎక్కడా మతసా మరస్యం దెబ్బ తినకుండా ప్రశాంతంగా పండుగలను నిర్వహించినట్లు తెలిపారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment