అంబులెన్స్ ఇవ్వడానికి నిరాకరించిన వైద్య సిబ్బంది తోపుడు బండిపై తీసుకెళుతున్న మృతదేహం.
హ్యూమన్ రైట్స్ టుడే/ఉత్తరప్రదేశ్/డిసెంబర్ 20:
ప్రభుత్వ ఆస్పత్రులలో అంబులెన్సులు ఉండవు, ఉన్నా అందరికీ ఇవ్వరు. ఇలాంటిదే ఒక సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది.
గుండెపోటుతో మంగళ వారం సాయంత్రం మరణిం చిన తన భార్య మృతదేహా న్ని,ఊరికి తీసుకువెళ్లేందు కు ఆస్పత్రి సిబ్బంది అంబు లెన్స్ ఇవ్వకపోవడంతో ఆ పేదవాడు తోపుడు బండిపై తీసుకువెళ్లాడు.
దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో ఆస్పత్రి అధి కారులు లబోదిబో మంటు న్నారు.అస్రౌలీ గ్రామానికి చెందిన వేదరామ్ తన భార్యకు గుండెపోటు రావడంతో ఫిరోజాబాద్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించాడు.
ఆమె చికిత్స పొందుతూ మంగళవారంసాయంత్రం మరణించగా తనభార్య శవాన్ని తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వమని వేదరామ్ ప్రాధేయపడినా సిబ్బంది నిరాకరించారు.
తన ఊరు పొరుగు జిల్లాలో ఉందన్న నెపంతో అంబు లెన్స్ ఇవ్వడానికి సిబ్బంది నిరాకరించారని వేదరామ్ చెప్పాడు. దాంతో బంధు వుల సహకారంతో భార్య శవాన్ని తోపుడు బండిపై ఉంచి ఇంటికి బయల్దేరాడు. ఈ ఫోటోలు వైరల్ కావ డంతో ఆస్పత్రి సూపరిం టెండెంట్ సంఘటనపై విచారణకు ఆదేశించారు.