చెట్లను నరకొద్దు అంటూ అధికారులను ఎదిరించిన..

Get real time updates directly on you device, subscribe now.

చెట్లను నరకొద్దు అంటూ అధికారులను ఎదిరించిన బాలుడు.

హ్యూమన్ రైట్స్ టుడే/సంగారెడ్డి జిల్లా/డిసెంబర్ 19:
చిన్న పిల్లలు ఆటలు ఆడుకుంటూ అల్లరిగా తిరుగుతారు. కానీ, కొంత మంది చిన్న పిల్లలు మాత్రం చాలా గొప్పగా ఆలోచి స్తారు. చిన్న వయసులో గొప్పగా ఆలోచించి వార్తల్లో నిలుస్తుంటారు.

తాజాగా ఓ బాలుడు అదే పని చేశాడు. మంగళవారం అధికారులు రోడ్డు వెడల్పు చేయడం కోసం చెట్టును నరికేస్తుంటే.బాలుని ఇంటి వద్ద ఉన్న చెట్టును మాత్రం నరకనివ్వను అంటూ అధికారులకు ఎదురు తిరిగాడు.

అంతే కాకుండా ఆ చెట్టు నరికితే నేను చినిపోతాను అని వార్నింగ్ కూడ ఇచ్చాడు. అంతటి తో ఆగకుండా అధికారులు చెట్టు నరకకుండా చెట్టు పైకి ఎక్కి కూర్చున్నాడు

ఈ ఘటన సంగారెడ్డి జిల్లా రామచంద్రపురం లో మంగళవారం జరిగింది
కాకతీయ నగర్‌లో అనిరుద్ అనే బాలుడు కుటుంబంతో నివాసం ఉంటున్నాడు.

బాలుడు ఇంటి ముందు పెద్దపెద్ద చెట్లు ఉన్నాయి. చెట్లపై పక్షులు వాలడం, వాటి అరుపులను ఆనం దంగా వినేవాడు. అయితే.. రోడ్డు వెడల్పు కోసం కాంట్రాక్టర్లు చెట్లను నరుకు తూ అనిరుద్ ఇంటి వైపు వచ్చారు.

అది గమనించిన బాలుడు.. సర్ ప్లీజ్ చెట్లను నరకొ ద్దంటూ రిక్వెస్ట్ చేశాడు. బాలుడు మాటలు పట్టిం చుకోకుండా చెట్టు నరికే ప్రయత్నం చేశారు.

కాంట్రా క్టర్. దీంతో అనిరుద్‌ కి ఏం చేయాలో తెలియక చెట్టు పైకి ఎక్కి కూర్చుని.. చెట్లను నరకడం ఆపండి అంటూ ప్రాదేయపడ్డాడు. అంతే కాకుండా పక్షులకి నివాసంగా ఉన్న చెట్టును నరకొద్దంటూ కోరుతూ.. నేను చచ్చిపోతాను కానీ చెట్టు నరకనివ్వను అంటూ మారం చేశాడు.

ఇంత చిన్న వయసులో చెట్టు కోసం బాలుడు మాట్లాడిన మాటలకు అధికారులు షాక్ అయ్యా రు. బాలుడుని చెట్టు నుంచి దిగమని కోరారు. అయినా ఏ మాత్రం లెక్కచెయ్య కుండా అలాగే కూర్చు న్నాడు.

దీంతో చేసేదేమి లేక అధికా రులు చెట్టును నరకడం కాసేపు నిలిపివేసి..బాలు డుని కిందకి దించేందుకు నానా తంటాలు పడ్డారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment