రెండో విడత గొర్రెల పంపిణీ కోసం గొల్ల కురుమల ఆందోళన..
హ్యూమన్ రైట్స్ టుడే /వేములవాడ/డిసెంబర్ 19:
యాదవ హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొక్కు దేవేందర్ యాదవ్ ఈ సందర్భంగా మాట్లాడారు. గంభీరావుపేట మండలం లింగన్నపేట లో 61 మంది గొల్ల కురుమలు రెండో విడత గొర్రెల కోసం డీడీలు తీసి ఆరు నెలలు గడిచింది. గత ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ నిర్లక్ష్య ధోరణి వల్ల తమకు గొర్రెల పంపిణీ జరగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం తమ సమస్యను పట్టించుకోని న్యాయం చేయాలని, 15 రోజుల్లో తమకు గొర్రెలను పంపిణీ చేయాలని కోరారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో గొల్ల కురుమలకు రూ. 2లక్షలు, గొల్ల కుర్మలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని అంశం ఉన్నాయని గుర్తు చేశారు. ప్రభుత్వం స్పందించి యాదవుల సమస్యలను పట్టించుకోవాలని కోరారు.