డిసెంబర్ 20 నుంచి డీఈఈసెట్ కౌన్సెలింగ్

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/ డిసెంబర్ 19: డీఈఈ సెట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ షెడ్యూల్ను ఎట్టకేలకు  అధికారు లు రిలీజ్ చేశారు. ఈనెల 20 నుంచి వచ్చే ఏడాది జనవరి 5 వరకు ఫస్ట్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ఉంటుందని డీఈఈసెట్ కన్వీనర్ శ్రీనివాస్ చారి తెలిపారు. 2023–25 విద్యాసంవత్సరానికి గానూ డీపీఎస్ఈ, డీఈడీ కోర్సుల్లో అడ్మిషన్లను నిర్వహించనునట్టు చెప్పారు. ఈ నెల20న అన్ని సర్కారు డైట్ కాలేజీల్లో అభ్యర్థులు సర్టిఫికేట్ల వెరిఫికేష న్ చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 22 నుంచి 27 వరకూ వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని, 30న సీట్ల అలాట్ మెంట్ ఉంటుందని వెల్లడించారు. 

జనవరి 5 లోగా సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని తెలిపారు. కాగా, డీఈఈసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు ఇచ్చిన 6 నెలల తర్వాత అడ్మిషన్లు నిర్వహించడంపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. డీఈడీ, డీపీఎస్ఈ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం విద్యాశాఖ అధికారులు జూన్1న డైట్ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టగా, అదేనెల 15న ఫలితాలు రిలీజ్ చేశారు. ఈ పరీక్షకు 5150 మంది అటెండ్ కాగా, 3975 మంది క్వాలిఫై అయ్యారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment