ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం

Get real time updates directly on you device, subscribe now.

ఆటో డ్రైవర్లకు న్యాయం చేస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 19:
ప్రజాభవన్‌లో నిర్వహించిన ప్రజావాణి కి మంచి స్పందన వచ్చిందని రవాణా, బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయిం ట్‌లో వివరాలను వెల్ల డించారు. మంగళవారం 5,126 దరఖాస్తులు వచ్చాయ తెలిపారు. అందులో ఎక్కువ అప్లి కేషన్లు డబుల్ బెడ్‌ రూం ఇండ్ల కోసం వచ్చాయని పేర్కొన్నారు.

నిరుద్యోగులు కూడా ఎక్కు వ సంఖ్యలో వచ్చారని తెలిపారు. వాళ్ల సమస్యలు ఖచ్చితంగా పరిష్కారం చేస్తామని స్పష్టం చేశారు.

మహిళలకు ఇచ్చిన హామీ ప్రకారం ఫ్రీ బస్ అమలు చేస్తున్నాం. బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో వాళ్లు ఇబ్బంది పడుతున్నారని.. ఆ విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు.

ఆటో వాళ్లు తమ సోదరులే అని..వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. సమస్య పరిష్కరించేవరకు ఓపికగా ఉండాలని మంత్రి కోరారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment