గంభీరావుపేట చౌక ధర దుకాణంలో కొత్త రకం బియ్యం పంపిణీ.
హ్యూమన్ రైట్స్ టుడే/వేములవాడ/డిసెంబర్ 19:
ఆందోళన చెందుతున్న వినియోగదారులు.
ప్లాస్టిక్ బియంగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం ఉచిత బియ్యం సరఫరా లో ఇలాంటి బియ్యాన్ని తాను ఎప్పుడూ చూడలేదని నిర్గాంత పోతున్నారు.
గంభీరావుపేటలోని ఒక చౌక ధర దుకాణం ద్వారా ఈ బియ్యాన్ని తీసుకొని వచ్చినట్లు వినియోగదారులు పేర్కొంటున్నారు.
ఈ బియ్యం పై విచారణ జరిపించాలని, ఈ బియ్యం నాణ్యతను పరిశీలించాలని, ప్లాస్టిక్ బియ్యం అయినట్లయితే సరఫరాను వెంటనే నిలిపివేయాలని గంభీరావు పేట పట్టణ ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.