ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురి దారుణ హత్య
హ్యూమన్ రైట్స్ టుడే/కామారెడ్డి జిల్లా/డిసెంబర్ 19:
పక్కనే ఉన్న మరో ఇంటిని కాజేయడానికి ప్రయత్నించి కుటుంబాన్ని తమ్ముడితో కలిసి మట్టుబెట్టిన ఘటన కామారెడ్డి జిల్లా, సదాశివ నగర్‌లో వెలుగులోకి వచ్చింది.
పోలీసుల కథనంప్రకారం. నిందితులు ఒకే కుటుం బానికి చెందిన ఆరుగురిని పదిహేను రోజ ల్లోనే అత్యం త పాశవికంగా హత్య చేసి ఒక్కొక్క మృత దేహాన్ని ఒక్కో వైపు పడేసి ఎవరికీ అనుమానం రాకుం డా జాగ్రత్తపడ్డారు.
ఎట్టకేలకు నిందితుడిని గుర్తించిన పోలీసులు వరుస హత్య కేసుల దర్యాప్తులను కొలిక్కి తెచ్చే పనిలో ఉన్నా రు. నిందితులు ఇవి కాక ఏవైనా హత్యలకు పాల్ప డ్డారఅని ఆరా తీస్తున్నారు.
సదాశివనగర్ మండలం, గాంధారి రోడ్‌లో సగం కాలిపోయిన ఓ యువతి మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు ఆ కేసు దర్యాప్తు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ వరుస హత్య కేసులు వెలుగులోకి వచ్చాయి.
నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలానికి చెందిన ప్రసాద్ అనే యువకుడు కొన్నేళ్ల క్రితం భార్య, ఇద్దరు పిల్లలు, ఇద్దరు చెల్లెల్లతో కలిసి కామారెడ్డి జిల్లా, మాచా రెడ్డికి మకాం మార్చాడు.
ప్రసాద్‌కి మాక్లూర్‌లో సొంత ఇల్లు ఉంది. ప్రసాద్ ఇంటి పక్కనే ఉండే ఓ వ్యక్తి ఆ ఇంటిమీద కన్నేశాడు. ప్రసా ద్‌తో స్నేహంగా ఉంటూనే, అతని కుటుంబం మొత్తాన్ని మట్టుబెడితేనే ఆ ఇల్లు తన సొంతం అవుతుందని కుట్ర పన్నాడు.
తన తమ్ముడితో కలిసి ప్రసాద్ కుటుంబాన్ని హత్య చేయడానికి సిద్ధమ య్యాడు. ఆ ఇంటి విషయంలో మాట్లాడాల్సి ఉందని చెప్పి ప్రసాద్‌ను సదాశివనగర్ అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు.
ప్రసాద్ సదాశివనగర్ పోలీ సు స్టేషన్‌లో ఉన్నాడని నమ్మించి ఆయన భార్యను మాచారెడ్డి నుంచి తీసుకెళ్లి సదాశివనగర్ దగ్గర గల అటవీ ప్రాంతంలో హత్య చేసి బాసర గోదావరిలో విసిరేసినట్లు నిందితుడు విచారణలో వెల్లడించాడు.
ప్రసాద్ ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు చెల్లెళ్లను సైతం అతి కిరాతకంగా హత్య చేసి వేర్వేరు ప్రాంతాల్లో పడేశా డని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది.