ములుగు జిల్లా నుంచే పరిపాలన కొనసాగిస్తా: మంత్రి సీతక్క
హ్యూమన్ రైట్స్ టుడే/ములుగు జిల్లా/డిసెంబర్ 17:
రాష్ట్ర మంత్రిగా ఉన్న ఇతర బాధ్యతలు ఉన్న ములుగు నుంచే పాలన కొనసాగిస్తా నని, రాష్ట్ర పంచాయతీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క వెల్లడించారు.
తాను ఎక్కడున్నా ములుగే తన కుటుంబం, ములుగు ప్రజలు తన కుటుంబ సభ్యులన్నారు. ప్రజలకు జవాబు దారిగా చెప్పాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు.
సీతక్క ఎక్కడ ఉన్నా ములుగు జిల్లా ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామి అవుతానన్నారు. రాష్ట్ర మంత్రిగా ప్రజల అభివృద్ధి కోసం ప్రజల సంక్షేమం కోసం పాటుపడతానని, వెనుక బడిన గ్రామాల అభివృద్ధికి దోహద పడే అవకాశం రావడం అదృష్టంగా బావి స్తున్నానని, మంత్రి సీతక్క పేర్కొన్నారు.