*రేపు హైదరాబాద్ కు రానున్న రాష్ట్రపతి*
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 17:
శీతాకాలం విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము సోమవారం హైదరాబాద్‌కు రానున్నారు.
రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పర్యటన నేపథ్యంలో అధికారులు కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు.
హకీంపేట్ విమానాశ్రయం నుంచి బొల్లారం రాష్ట్రపతి నిలయం, సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ వరకూ కాన్వాయ్‌తో రిహార్సల్ నిర్వహించారు.
రేపటి నుంచి 23వ తేది వరుకూ హైదరాబాద్ నుంచి అధికారిక కార్యక్రమాలు కొనసాగించాలని,రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము,తెలిపారు.
ఐదు రోజల పాటు రాష్ట్ర పతి, హైదరాబాద్‌లోనే ఉండనున్నారు. ఈ నెల 23న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఢిల్లీకి వెళ్ళను న్నారు.