చలి కాలంలో హాట్ హాట్ గా, సాగుతున్న అసెంబ్లీ
హ్యూమన్ రైట్స్ టుడే/హైదరాబాద్/డిసెంబర్ 16:
తెలంగాణ అసెంబ్లీ హాట్ హాట్‌గా నడుస్తోంది. గవర్నర్‌కు ధన్యవాదాలు తెలిపే తీర్మానంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
గవర్నర్ ప్రసంగం పూర్తిగా తప్పులతడకే అని.. తాము ఎప్పటికీ ప్రజాపక్షమే తెలం గాణ పక్షమే.. కాంగ్రెస్ ఎప్ప టికీ విపక్షమే అన్న కేటీఆర్ కామెంట్స్‌పై రేవంత్ మండి పడ్డారు. కేటీఆర్‌ను ఎన్ఆర్ ఐ అంటూ సెటైర్ విసిరారు.
కొంతమంది ఎన్ఆర్ఐలకు ప్రజాస్వామ్యం గురించి చెప్పినా అర్థం కాదన్నారు. అచ్చోసిన ఆంబోతులా పోడియంకు దూసుకు వస్తాం అంటే సరికా దన్నారు.
పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టినరోజు మాట్లాడిన నాయకుడు పీజేఆర్ తమ నేత అని చెప్పుకొచ్చారు. చీమలు పెట్టిన పుట్టలో జోర్రినట్టు కేటీఆర్ మేనేజ్మెంట్ కోటాలో వచ్చారని వ్యాఖ్యలు చేశారు.
కేకే మహేందర్ రెడ్డికి అన్యాయం చేశారన్నారు. గత పాలన గూర్చి మాట్లా డుదామంటే ఒక రోజంతా చర్చ పెడదా మన్నారు. గత పాలనలో పాపం ఉందంటే ఆనాటి పాలకుల్లో చాలా మంది ఇప్పుడు బీఆర్ ఎస్‌లోనే ఉన్నారని తెలిపారు.
కేసీఆర్‌కు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అని గుర్తుచేశారు. కేసీఆర్‌కు సింగిల్ విండో ఎన్నికలలో పోటీచేసే అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ అని తెలిపారు. పిల్లి శాపనార్థాలకు ఉట్లు తెగిపడవన్నారు. ప్రతి పక్షాలను గౌరవించే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీకి ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.