కన్న కూతురిని చిత్ర హింసలు పెట్టిన కసాయి తండ్రి

Get real time updates directly on you device, subscribe now.

మూడో పెళ్లికి అడ్డొ స్తుందని కన్న కూతురిని చిత్ర హింసలు పెట్టిన కసాయి తండ్రి

హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్/ఎన్టీఆర్ జిల్లా/డిసెంబర్13:
అతనికి మూడో పెళ్లికి అడ్డుగా ఉందని కన్న కుమార్తెను చిత్రహింసలు పెట్టి ఈ లోకం నుంచి పంపేయాలనుకున్నాడో కసాయి తండ్రి. మాతృ త్వానికి, మమ కారానికి మచ్చతెచ్చేలా సహక రించింది,అతని తల్లి. అంగన్‌వాడీ ఆయా చొర వతో ఆ ఐదేళ్ల బాలిక నరకం నుంచి బయట పడింది.


ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్య పేటలోని నాగమయ్య బజార్‌లో మంగళ వారం సాయంత్రం ఈ సంఘటన వెలుగు చూసింది.కార్పెంటర్‌ పనిచేసే నక్కల ప్రవీణ్‌ (30), అతని తల్లి గోవర్థ నమ్మ ఆరు నెలల నుంచి జగ్గయ్యపేటలోని నాగ మయ్య బజార్‌లో అద్దెకు ఉంటున్నారు.

గౌరవరం గ్రామానికి చెందిన ప్రవీణ్‌కు ఎనిమిదేళ్ల క్రితం వివాహం కాగా, అతని ప్రవర్తనతో వేగలేక భార్య ఏడాదికే విడాకులు తీసు కుంది. తర్వాత సంవత్సరా నికి నందిగామకు చెందిన తిరుపతమ్మ అనే మహిళ ను ప్రవీణ్‌ రెండో వివాహం చేసుకుని జగ్గయ్యపేట ధనంబోడులో కాపురం పెట్టాడు.

వారికి లోహిత జన్మించింది. నాలుగేళ్ల క్రితం తిరుపతమ్మ అనుమానాస్పద స్థితిలో మృతిచెందగా బంధువులు ప్రవీణ్‌ హతమార్చాడనే అనుమానం వ్యక్తంచేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసు ఇంకా నడుస్తూనే ఉంది.

మరో పెళ్లి చేసుకునేందుకు లోహిత అడ్డుగా ఉందని ప్రవీణ్‌, అతని తల్లి గోవర్ధ నమ్మ, కొద్ది రోజులు ఆ చిన్నారిని పట్టణంలోని బంధువుల వద్దకు పంపిం చారు. వారు ఇటీవలే ఆ బాలికను తీసుకొచ్చి తండ్రికి అప్పగించారు.

అప్పటి నుంచి లోహితకు సరిగా ఆహారం పెట్టక పోవటం, కొట్టడం చేస్తు న్నారు.ఈ క్రమంలో బాలిక తలకు తీవ్ర గాయమైంది. వీపు మొత్తం గాయాలతో కమిలి పోయింది. ఇటీవల బాలికను చీరతో కట్టేయ టంతో స్థానికులకు ఆమె అరుపులు వినిపిం చాయి..వారు అంగన్‌వాడీ ఆయా జరీనాకు సమా చారం అందించారు.

ఆమె నాలుగు రోజుల క్రితం ఫోటోలు సేకరించి ఉన్నతా ధికారులకు తెలియజేసింది. వారు మంగళవారం సాయంత్రం వచ్చి ఆ బాలికకు నరక కూపం నుంచి విముక్తి కల్పించారు.

తొలుత బాలిక తమ వద్ద లేదని చెప్పేందుకు ప్రవీణ్‌, గోవర్ధనమ్మ చాలాసేపు ప్రయత్నించారు. వచ్చిన వారిపై ఎదురుదాడికి కూడా దిగారు. ఎట్టకేలకు స్థాని కులు, పోలీసుల సహ కారంతో ఇల్లు మొత్తం సోదా చేయగా బాత్‌రూంలో బకెట్‌ లోదాచి..పైన బట్టలు కప్పి ఉంచిన విషయం బయట పడింది. ప్రవీణ్‌, గోవర్ధన మ్మలను అదుపు లోకి తీసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment