హైదరాబాద్ కు నిజాం పార్థివదేహం..నివాళి అర్పించనున్న కేసీఆర్

Get real time updates directly on you device, subscribe now.

హ్యూమన్ రైట్స్ టుడే/హైదరబాద్/17 జనవరి 2023: ట‌ర్కీలో తుది శ్వాస విడిచిన ఏడో నిజాం మ‌న‌వ‌డు ముకర్రంజా బహదూర్ భౌతికకాయాన్నినేడు హైద‌రాబాద్‌కు త‌ర‌లించ‌నున్నారు. ప్ర‌త్యేక విమానంలో ముకర్రంజా భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చిన అనంతరం చౌమహల్లా ప్యాలెస్‌ ప్రజల సందర్శ‌నార్థం ఉంచుతారు. ఆయ‌న చివరి కోరిక మేరకు హైదరాబాద్‌లో ఖననం చేయనున్నారు. మక్కా మసీద్‌లో అధికారిక లాంఛ‌నాల‌తో ఖననం చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ముకర్రంజా అస‌లు పేరు భర్కత్‌ అలీ ఖాన్‌. ఏడో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ కుమారుడు ఆజాం ఝా, టర్కీ చివరి సుల్తాన్ అబ్దుల్ మేజీద్-2 కుమార్తె దురు షెహవర్ దంపతులకు 1933 అక్టోబర్ 6న ముకర్రం ఝా జన్మించారు. 1971 వరకు హైదరాబాద్ యువరాజుగా అధికారికంగా పేరొందారు. ఈయ‌న‌ను 8వ నిజాంగా పిలుస్తుంటారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment