ఏలూరు జిల్లాలో దంపతుల ఆత్మహత్య

Get real time updates directly on you device, subscribe now.

ఏలూరు జిల్లాలో దంపతుల ఆత్మహత్య..

హ్యూమన్ రైట్స్ టుడే/ఏలూరు జిల్లా/డిసెంబర్ 13:
అప్పుల భాధ తో దంప తులు ఆత్మహత్య చేసు కున్న ఘటన ఏపీలోని ఏలూరు జిల్లా లో మంగళ వారం సాయంత్రం చోటు చేసుకుంది..వివరాలలోకి వెళితే.. పోలీసుల కథనం ప్రకారం..

ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెదగొన్నూరు శివారు విశ్వనాద్రిపాలెం గ్రామానికి చెందిన పరసా మాత నాగబాబు కు తెలంగాణ రాష్ట్రం సూర్యపేటకు చెందిన అనూషతో 2015 లో వివాహం జరిగింది.

ఈ దంపతులకు ఆరు సంవత్సరాల కుమారుడు, నాలుగు సంవత్సరాల కుమార్తె ఉన్నారు.కాగా మంగళ వారం సాయంత్రం దంపతులు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి పై కప్పుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకు న్నారు.

మంగళవారం సాయంత్రం నాగబాబు తల్లి వెళ్లి చూడగా భార్యాభర్తలు వేలాడుతూ కనిపించారు. వెంటనే స్థానికులు ఆసు పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

రొయ్యల సాగులో నష్టం రావడంతో జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఉత్తరం గదిలో దొరికింది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a comment