హ్యూమన్ రైట్స్ టుడే/ఆంధ్రప్రదేశ్/పల్నాడు/డిసెంబర్ 13: జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రాన్ని అందించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పల్నాడు జిల్లా అధ్యక్షులు
నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు డా ” పి.సంపత్ కుమార్,ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రెటరీ డా” కె ఆర్ రాజా ఆదేశాల మేరకు ఈరోజు పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ లోతోటి శివశంకర్ ను కలిసి పల్నాడు ప్రాంతంలో జరుగుతున్న వివిధ అవినీతి, అక్రమాలు, పలు అంశాలపై వినతి పత్రాన్ని అందించడం జరిగింది. కలెక్టర్ లోతోటి శివశంకర్ వెంటనే స్పందించి పల్నాడు ప్రాంతంలో అవినీతి, అక్రమాలు, జరగడానికి వీల్లేదని అలా చేస్తున్న వారిపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని క్రింది స్థాయి అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ పల్నాడు జిల్లా అధ్యక్షులు తాళ్లూరి సౌరిబాబు, ప్రధాన కార్యదర్శి షాలెం రాజు, జిల్లా పబ్లిక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నడికుడి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు పట్రా బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.